తెలుగు నుండి
సంస్కృతం లో మాట్లడేప్పుడు ముఖ్యముగా వచ్చే సమస్య లింగనిర్ణయము లో, అంటే ఏది
పుంలింగము, ఏది స్త్రీలింగము అని చాలా సందేహముగా ఉంటుంది. దాన్ని నివారించడం కోసమే
ఈ ప్రయత్నము. మీరు దీని ప్రోత్సహిస్తారనుకొంటున్నాను.
తెలుగులో వలె
సంస్కృతం లో అర్థాన్ని బట్టి లింగాన్ని నిర్ణయించడం ఉండదు. ఉదాహరణకు వృక్ష అనే
శబ్దము సంస్కృతంలో పుంలింగము, తెలుగులో అది నపుంసకలింగము. ఇటువంటి సందర్భాలను
తెలుపుచకు ఈ ప్రయత్నము.
1.
సంస్కృతము – संस्कृतम्
ఇది నపుంసకలింగము
లో ఉంటుంది. తెలుగులో సంస్కృతము లో కూడా. అయితే దీనికి భాషా అనే శబ్డాన్ని
చేర్చితే స్త్రీలింగము అవుతుంది. ఎందుకంటే భాషా అనేది స్త్రీలింగములో
ఉంటుంది.
संस्कृतभाषा मधुरा – సంస్కృతభాష మధురమైనది.
2.
కూటమి(Group) అనే అర్ధము లో సమూహము, సముదాయము అనే పదాలను
తెలుగులో ఉపయోగిస్తాము. అయితే సంస్కృతమున ఈ శబ్దములు రెండు పుంలింగము లో ఉంటాయి.
ఈ సమూహము
సంస్కృతసమూహము.
समूहम् – समूहः
समुदायम् - समुदायः
अयं समूहः संस्कृतसमूहः।
एतत् समूहम् संस्कृतसमूहम् ఇది అశుద్ధ ప్రయోగము.
3.
పుస్తకము గ్రంథము
అని తెలుగులో ఈ రెండు శబ్దాలను నపుంసకలింగము లో వాడతారు. అయితే ఇందులో పుస్తక
శబ్దము సంస్కృతం లో నపుంసకలింగము లో నే ఉంటుంది. గ్రంథశబ్దము మాత్రము పుంలింగము లో
ఉంటుంది.
पुस्तकम् – पुस्तकम्
ग्रन्थम् - ग्रन्थः
एतत् संस्कृतपुस्तकम्।
एषः व्याकरणग्रन्थः।
एतत् व्याकरणग्रन्थम्। ఇది తప్పు ప్రయోగము.
4.
ఉద్దేశము,
ఉద్దేశ్యము అని రెండు శబ్దాలను తెలుగులో నపుంసకలింగములోనే వాడుతున్నారు, అంతేకాదు
సంస్కృతం లో కూడా వీటిని ప్రయోగించేపుడు
సందేహము గా ఉంటుంది, ఏది పుంలింగము, ఏది నపుంసకలింగము అని, అయితే ఉద్దేశ
అనే శబ్దము పుంలింగము లోనే ఉంటుంది. ఉద్దేశ్యము అనే శబ్దము అభిప్రాయము అనే అర్థము
లో నపుంసకలింగము లో ఉంటుంది. కొన్ని అర్థాలలో విశేషణము గా వాడబడుతుంది అపుడు
విశేషణాన్ని అనుసరించి లింగము ఉంటుంది.
उद्देश्यम् – उद्देश्यम्, उद्देश्य
(वि)
उद्देशम् – उद्देशः
तव उद्देश्यं(అభిప్రాయము) किम्?
अस्य सूत्रस्य उद्देशः(వివరణ) कः?
5.
పదము, శబ్దము అనే
రెండు శబ్దాలను తెలుగులో నపుంసకలింగములోనే
వాడుతున్నారు. సంస్కృతంలో కూడా వీటిని ప్రయోగించేటపుడు సంశయముగా ఉంటుంది. ఏది
పుంలింగమో, ఏది నపుంసకలింగమో అని, ఇందులో పదశబ్దము నపుంసకలింగములో ఉంటుంది. శబ్ద
అనేది పుంలింగము లో ఉంటుంది.
पदम् – पदम्
शब्दम् – शब्दः
किं पदम् ?
कः शब्दः ?
6.
అర్ధ అనే శబ్దము
తెలుగులో నపుంసకలింగము లో ఉంటుంది. సంస్కృతం లో మాత్రము ఇది పుంలింగము లో ఉంటుంది.
దీని అర్థము
ఏమిటి అని తెలుగులో అంటాము.
సంస్కృతము లో అయితే
-
अस्य अर्थः कः అంటాము.
अस्य अर्थं किम् అనేది అశుద్ధము.
7.
సందేహము, సంశయము
అనే పదాలు తెలుగులో నపుంసకలింగము లో ఉంటాయి. అందువల్ల తెలుగు ప్రభావంతో సంస్కృతం
లో మాట్లాడేటపుడు వాటిని చాలా వరకు నపుంసకలింగములో వాడే ప్రమాదముంది. లేదా ఏ
లింగములో వాడాలా అనే సంశయము రావచ్చు.
సంస్కృతం లో ఈ
రెండు శబ్దాలు పుంలింగము లోనే ఉంటాయి.
సంశయము ఏంటి – संशयः कः ?
సందేహము ఏంటి – सन्देहः कः ?
संशयं किम्
सन्देहं किम् ఈ ప్రయోగాలు అసాధువులు అవుతాయి.
8.
విశేషము, విషయము
అనే రెండు శబ్దాలను తెలుగు లో నపుంసకలింగము లో వాడుతాము, అయితే వీటిని సంస్కృతము
లో పుంలింగము లో వాడుతాము.
कः विशेषः – విశేషమేమిటి
कः विषयः – విషయమేమిటి
किं विशेषम्
किं विषयम् ఇవి రెండు తెలుగు ప్రభావము తో సంస్కృతమున
వాడబడుతున్న పొరపాటు ప్రయోగాలు అనవచ్చు.
9.
అక్షరార్ధకమైన
వర్ణము అనే శబ్దము, రంగు అనే అర్ధము లో ఉపయోగించే వర్ణ అనే శబ్దము రెండు తెలుగులో
నపుంసకలింగములోనే వాడుతున్నాము. ఇదే ప్రభావము తో సంస్కృతము లో కూడా అక్షరవాచకము
నపుంసకమా, రంగు అనే అర్థాన్నిచ్చే వర్ణశబ్దము నపుంసకమా, లేదా రెండు పుంలింగమా,
లేదా రెండు నపుంసకలింగమా అనే సంశయము తప్పనిసరిగా వస్తుంది, అయితే రెండు అర్థాలలోను వర్ణశబ్దము సంస్కృతం లో
పుంలింగములో ఉంటుంది.
अस्य वस्त्रस्य वर्णः कः – ఈ వస్త్రము యొక్క రంగు ఏమిటి
ककारः व्यञ्जनवर्णः – కకారము వ్యంజనవర్ణము(అక్షరము)
10.
అర్థము అనే
శబ్దాన్ని అనేకార్థాలలో తెలుగు లో meaning, కారణము, డబ్బు మొదలైన అర్థాలలో నపుంసకలింగము లో
వాడుతున్నాము. అయితే దీనిని సంస్కృతము లో ఏ లింగము లో వాడుతారు అంటే, ఇది
పుంలింగము లో నే ఉపయోగిస్తారు.
अस्य शब्दस्य कः अर्थः – ఈ శబ్దమునకు అర్థమేంటి
क्षणशः कणश्शचैव
विद्यामर्थञ्च साधयेत् – ఇక్కడ అర్థశబ్దము
ధనము అనే అర్థము లో వాడిరి.
11.
ఆలయము అనే శబ్దము
తెలుగులో నపుంసకలింగము లో వాడుతున్నాము దేవాలయము, గ్రంథాలయము మొదలైనవి, అయితే ఇది
సంస్కృతము లో పుంలింగము లో ఉంటుంది.
आलयः दूरे अस्ति। ఆలయము దూరము గా ఉంది.
मया देवालयः गम्यते। నా చేత దేవాలయము వెల్లబడుతుంది.
12.
నియమ శబ్దము ను
తెలుగు లో నియమము అని ప్రయోగిస్తున్నాము,
అదే ప్రభావము తో సంస్కృతము లో కూడా नियमम् అని వాడుతున్నాము. అయితే ఇది సంస్కృతము లో
పుంలింగములో ఉంటుంది.
नियमः कः – నియమము ఏమిటి అని అర్థము.
नियमं किम् – ఇలా ప్రయోగించటం పొరపాటు.
13.
పాఠశబ్దము
తెలుగులో పాఠము అని ప్రయోగిస్తున్నాము. అదే ప్రభావము తో సంస్కృతము లే కూడా पाठम् అని వాడుతున్నాము. అయితే అది సంస్కృతము లో పుంలింగము లో ఉంటుంది.
कः पाठः – ఇది సరైన ప్రయోగము.
किं पाठम् – ఇది సరైనది కాదు.
మీ ప్రయత్నాన్ని అద్భుతంగా కొనసాగించండి చాలా అద్భుతంగా ఉంది
ReplyDeleteధన్యవాదాలు
Delete